By : Oneindia Telugu Video Team
Published : January 08, 2018, 06:39

ఈవినింగ్ బిగ్ న్యూస్ బిగ్ బైట్ !

ఉత్తర ప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌లో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలియగానే మూడు ఫైరింజన్లు అక్కడకు వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రిన్సిపల్ కార్యాలయం నుంచి మంటలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.
జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం ఏలూరు శివారులోని పెదవేగి మండలం భోగాపురం పంచాయతీ పరిధిలో ఉన్న వట్లూరు పెద్ద చెరువులో మునిగి నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. నాలుగు మృతదేహాలను అంబులెన్స్‌లలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులకు.. చెరువు పక్కనే ఉన్న జామతోటలో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, భోజనం బాక్సులు, కొన్నిరకాల పండ్లు, మద్యం బాటిళ్లు, మంచినీళ్ల ప్యాకెట్లు లభించాయి. దీంతో విద్యార్థులు నలుగురు మద్యం తాగి ఆ మత్తులో చెరువులోకి దిగారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జ్యోతిష శాస్త్ర ప్రకారంగా సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యఘడియలను ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము.సంక్రాంతి పండుగ 14 న జరుపుకోవాలా ? 15 న జరుపుకోవాలా ? అని చాలా మంది సందేహంతో ఉన్నారు.అసలు ఖగోళ ప్రకారం సూర్యుడు తేది 14 జనవరి 2018 ఆదివారము రోజు మధ్యాహ్నము 01 : 46 ని॥లకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.కావున అదే రోజునాడే మకర సంక్రాతి పండుగను శాస్త్రపరంగా ఆచరించాలి. కావున సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయములో అపోహలొద్దు. సంక్రాంతి మొదటి రోజు తేది 13-జనవరి-2018 శనివారము రోజున భోగిపండగ. సంక్రాంతి రెండవ రోజు తేది14-జనవరి-2018 ఆదివారము రోజున మకర సంక్రాంతి పండగ. సంక్రాంతి మూడవ రోజు కనుమ పండగ తేది15-జనవరి-2018 సోమవారము రోజున కనుమ.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా