By: Oneindia Telugu Video Team
Published : January 10, 2018, 04:58

బిగ్ న్యూస్ బిగ్ బైట్ 10-01-2017

Subscribe to Oneindia Telugu

1. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాతల మీదకు ఊహించని కేసు వచ్చి పడింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాడిన 'కొడకా కోటేశ్వరరావు' అనే పాటను వెంటనే నిషేధించాలని, సినిమా నుండి తొలగించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఈ పాట వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వ‌ర‌రావుల పరువు పోతోందని, కోటేశ్వ‌ర‌రావు పేరుగ‌ల వారి మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయని.... విజయవాడకు చెందిన కోటేశ్వ‌ర‌రావు అనే న్యాయ‌వాది ఈ పాట‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ మాచ‌వ‌రం పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న‌ ఫిర్యాదు చేశారు.
నాకు సినిమా గురించి పెద్దగా తెలియదు. రోజూ కోర్టుకు వెళ్లి వస్తుంటే అందరూ పరువు తీస్తున్నారు. ఈ మ‌ధ్య మా అన్న‌య్య పిల్ల‌లు, అక్క‌య్య పిల్ల‌లు మా ఇంటికి వ‌చ్చారు. వారు మ‌న బాబాయి పేరు కోటేశ్వ‌ర‌రావు క‌ద‌రా అని మాట్లాడుకుంటున్నారు. నా ముందే కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు అని పాట పాడుతున్నారు. నాకు చాలా బాధేసింది.... అని కోటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు.
2. కర్ణాటకలోని మడికేరి లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ సాధన సమావేశంలో నిద్రపోయిన కర్ణాటక cm సిద్దరామయ్య.
౩. నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ కలకలం సృష్టించింది. మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం వేకువజామున ఎనిమిది మంది చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు దోపిడీకి పాల్పడ్డారు.ఏపీ09 సీపీ 4061 నంబర్‌ గల వాహనంలో వచ్చిన ఈ చెడ్డీ గ్యాంగ్.. బ్లూమింగ్‌ డాల్‌ అపార్టుమెంట్‌లోకి జోరబడి వాచ్‌మన్‌ను కట్టేశారు, అనంతరం లోనికి ప్రవేశించి ఎనిమిది ఫ్లాట్లకు బయటి నుంచి గడియ పెట్టారు. చంద్రమోహన్‌రెడ్డికి చెందిన అపార్టుమెంట్‌లోకి ప్రవేశించి 11 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్ళారు. ఆ సమయంలో ఇంటి యజమాని ఇంట్లో లేరు. పనిమీద పొరుగూరికి వెళ్ళారు. కాగా, ఆయన పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.
అపార్ల్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్ అలజడితో ఇరుగుపొరుగు అపార్టుమెంట్‌లలోని వారు లేచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, బయటి నుంచి గడియ పెట్టడంతో తలుపులు తెరుచుకోలేదు. దీంతో గట్టిగా కేకలు పెట్టారు. ఆ కేకలు విన్న సమీపంలోని ప్రజలు రావడంతో చెడ్డీగ్యాంగ్‌ ముఠా అక్కడ్నుంచి పరారైంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా