By: Oneindia Telugu Video Team
Published : January 08, 2018, 01:07

బిగ్ న్యూస్ బిగ్ బైట్ : టుడే ట్రెండింగ్ న్యూస్

Subscribe to Oneindia Telugu

కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటను అంఫైర్లు రద్దు చేశారు. దుర్గ గుడిలో రహస్య పూజల వ్యవహారంలో ఈవో సూర్య కుమారిని బదలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట జూనియర్ కళాశాలలో జనవరి 7,8,9 తేదీల్లో ఎపి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ వైభవంగా ప్రారంభమైంది, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నటి పూనం కౌర్‌కు మద్య సంబంధాలపై అనుమానాలు రేకెత్తించే విధంగా మహేష్ కత్తి తీవ్రమైన ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం రేపింది. మహేష్ కత్తి అంత దూరం వెళ్లడం వెనక పనిచేస్తున్న శక్తులేమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తన వెనక ఎవరూ లేరని మహేష్ కత్తి పదే పదే చెబుతున్నప్పటికీ నమ్మడానికి ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరు. పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో వ్యూహాత్మకంగానే మహేష్ కత్తి మీడియా ముందుకు వచ్చారని అంటున్నారు. బెంగళూరు: నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్కే మార్కెంట్‌లోని కైలాశ్ బార్‌ అండ్ రెస్టారెంట్‌లో చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా