By : Oneindia Telugu Video Team
Published : October 19, 2020, 06:10
Duration : 02:17
02:17
మోనాల్ -అఖిల్ కౌగిలింతలు... మోనాల్ ఉంటేనే TRP అందుకే సేవ్ ?
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ కార్యక్రమం పై తెలుగు రాష్ట్రాల ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బిగ్‌బాస్‌పై వారు పెడుతున్న పోస్టులు చూసిన వారికెవరికైనా ఈ విషయం అర్థం అవుతుంది. మొదటి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియపై చాలా అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఈ సారి అంటే ఆరోవారం ఎలిమినేషన్ పై కూడా ప్రేక్షకులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక బిగ్‌బాస్ ఇష్టం వచ్చిన వారిని ఎలిమినేట్ చేసేలా ఉంటే ఇక ప్రేక్షకులను ఓట్లు వేయమనడం దేనికంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తాజాగా కుమార్ సాయి ఎలిమినేషన్లో కూడా ఇదే జరిగిందంటూ ప్రేక్షకులు నెట్టిల్లు వేదికగా ఫైర్ అవుతున్నారు.