By: Oneindia Telugu Video Team
Published : November 06, 2017, 07:14

పోస్టల్ స్టాంపులపై హైద్రాబాద్ బిర్యానీ, తిరుపతి లడ్డు, ఇడ్లీ, దోశ

Subscribe to Oneindia Telugu

హైద్రాబాద్ బిర్యానీ అంటే తెలియని వారుండరు. హైద్రాబాద్‌కు వచ్చినవారెవరూ కూడ ఈ బిర్యానీ తినకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ బిర్యానీ మరో అరుదైన ఘనతను దక్కించుకొంది. బిర్యానీ ఇండియా స్టాంప్‌లపై దర్శనమివ్వనున్నాయి. హైద్రాబాద్ బిర్యానీ రుచి ఇతర బిర్యానీలకు ఉండదనే ప్రచారం కూడ ఉంది. విదేశీయులే కాదు ఇండియాలోని పలు రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులు కూడ ఈ బిర్యానీ రుచి చూడకుండా వెళ్ళరు. ఏళ్ళ తరబడి ఈ బిర్యానీ తయారీ హైద్రాబాద్‌లో సాగుతోంది. ఈ బిర్యానీ తయారీ విధానం డిఫరెంట్‌గా ఉంటుందని చెబుతారు నిపుణులు. అయితే బిర్యానీ పేరు మీదనే హైద్రాబాద్‌లో హోటళ్ళు వెలిశాయి.
హైదరాబాద్ బిర్యానీ ఇక నుండి ఇండియన్ పోస్టల్ స్టాంపులపై దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు భారత పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా 24 వంటకాలతో పోస్టల్ స్టాంపు ఫొటోలను గత శుక్రవారం విడుదలచేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాలుగు వంటకాలకు స్థానం కల్పించింది. ఇందులో హైద్రాబాద్‌కు చెందిన బిర్యానీకి స్థానం దక్కింది. హైదరాబాద్ బిర్యానీకి స్థానం కల్పించడంలో ప్రత్యేకత ఉంది. కుతుబ్‌షాహీ సామ్రాజ్యస్థాపన, గోల్కొండ కోట నిర్మాణానికి మరో రెండునెలల్లో 500 ఏండ్లు పూర్తవుతాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా