By: Oneindia Telugu Video Team
Published : December 29, 2017, 05:44

Bitcoins : బిట్ కాయిన్ అంటే అదన్నమాట !

Subscribe to Oneindia Telugu


బిట్ కాయిన్‌.. ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న మాట. అంతేకాదు, ఈ బిట్ కాయిన్ విలువ అమాంతం పైకి పెరుగుతోందనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో బిట్ కాయిన్స్‌ గురించి తెలియ‌క‌పోయినా చాలామంది వాటితో క‌రెన్సీ ట్రేడింగ్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఒక బిట్ కాయిన్ విలువ 18 వేల అమెరిక‌న్ డాల‌ర్లకు పైనే ఉంది. మార్చి 2010లో బిట్ కాయిన్ విలువ 0.003 డాల‌ర్లుగా ఉండేది. ఇప్పుడు చూస్తే కొన్ని ల‌క్ష‌ల రెట్లు పెరిగిపోయింది. అస‌లు బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఇది ఎలా చలామణీలోకి వచ్చింది?

బిట్ కాయిన్' అనేది నిజానికి ఏ దేశానికి చెందిన క‌రెన్సీ కాదు. దీన్ని ఏ దేశం కూడా త‌యారు చేయ‌లేదు. ఇదొక వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ. దీన్నే డిజిట‌ల్ క‌రెన్సీ, క్రిప్టో కరెన్సీ అని కూడా పిలుస్తారు. అంటే.. కేవ‌లం ఇంట‌ర్నెట్‌లోనే ఈ క‌రెన్సీ చెల్లుబాటు అవుతుంద‌న్న‌మాట‌. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రపంచం అంతా బిట్లు, బైట్లతోనే ఉంటుంది కదా (1 బైట్ = 8 బిట్లు), అందుకని ఇంటర్నెట్ లో మాత్రమే చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక దీనికి ‘బిట్ కాయిన్' అని పేరు పెట్టారు. ఈ బిట్ కాయిన్ క‌రెన్సీని మొద‌ట 2008లో స‌తోషి న‌క‌మొటొ అనే వ్య‌క్తి అందుబాటులోకి తెచ్చాడు. ఇది ఆ వ్య‌క్తి అస‌లు పేరు కూడా కాదు. ఎవ‌రో గుర్తుతెలియని వ్య‌క్తి స‌తోషి న‌క‌మొటొ పేరిట బిట్ కాయిన్‌ను ప్ర‌వేశ‌పెట్టాడు. అదే సంవ‌త్స‌రంలో.. అంటే.. ఆగ‌స్టు 18, 2008న బిట్‌ కాయిన్ డాట్ ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌ను కూడా అత‌ను ప్రారంభించాడు. ఆ వెబ్‌సైట్ ఇప్ప‌టికీ ర‌న్నింగ్‌లోనే ఉంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా