By: Oneindia Telugu Video Team
Published : September 01, 2017, 05:48

ఆ దెబ్బకు జగన్ భయపడ్డారా, ఎదురుతిరిగిన టిడిపి బాబుపై బిజెపి ఆగ్రహం

Subscribe to Oneindia Telugu

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. నంద్యాల ఓటమి అనంతరం కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పరాజయం వైసిపిని వేధిస్తోంది. చంద్రబాబు పాలనపై ప్రజలకు విశ్వాసం లేదని, త్వరలో నేను ముఖ్యమంత్రిని అవుతానని జగన్ పదేపదే చెబుతూ వస్తున్నారు. అంతేకాదు, వైసిపి నుంచి టిడిపిలో చేరిన 21 మందితో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ సవాల్ చేస్తున్నారు.మరోవైపు, కాకినాడ ఎన్నికల్లో టిడిపి రెబల్ అభ్యర్థులు బిజెపికి షాకిచ్చారు. టిడిపి రెబల్ అభ్యర్థులు పోటీ చేయడంతో 9 స్థానాల్లో పోటీ చేసిన బిజెపి 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇద్దరు టిడిపి రెబెల్స్ గెలిచారు. దీనిపై స్థానిక బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నచ్చ చెప్పితే టిడిపి రెబల్స్ పోటీ చేయకుండా ఉండేవారని మండిపడుతున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా