By: Oneindia Telugu Video Team
Published : December 19, 2017, 09:41

డబల్ హ్యాట్రిక్ ! భాజపా విజయ దుందుభి..!

Subscribe to Oneindia Telugu

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించింది అనే దానికి తెరపడింది. భాజపా విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్‌ పార్టీ గుజరాత్‌ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. భాజపానే విజేతగా నిలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో గుజరాత్‌లో వరుసగా భాజపా ఆరోసారి అధికారంలోకి వచ్చింది. రెండు రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు అభినందనలు తెలిపారు. మొత్తం గా 182 స్తానాల్లో 99 స్తనాలు bjp కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 80 కు చేరుకుంది. అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఆయన స్పందించారు. బీజేపీ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీని అభినందిస్తున్నానని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్ అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అంతకుముందు కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా బీజేపీకి కంగ్రాట్స్ తెలిపారు. ఇలా bjp విజయం సాధించడం పై పలువురు ఆసక్తికర ట్వీట్ లు చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. bjp విజయం పై నేతలు ఆనందం లో సంబరాలు చేసుకుంటున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా