By: Oneindia Telugu Video Team
Published : December 22, 2017, 05:15

బిజెపిలో చంద్రబాబు చిచ్చు

Subscribe to Oneindia Telugu

పోలవరం ప్రాజెక్టు పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబ్బులు చేసుకుంటున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆరోపిచారు. విజయవాడలో గురువారం పోలవరంపై కృష్ణా డెల్టా పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తనను భగీరథుడిగా పిలిపించుకోవడానికి చంద్రబాబు ప్రతి ఒక్కరి దృష్టిని పోలవరం వైపు మళ్లిస్తున్నారని ఆయన అన్నారు. అన్ని ప్రాజెక్టుల ద్వారా చంద్రబాబు, ఆయన జట్టు డబ్బులు చేసుకుంటున్నట్లు వడ్డే ఆరోపించారు.పోలవరం ప్రాజెక్టును 2108నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు తనకు తాను తనకోసం పెట్టుకున్న గడువు అని ఆయన అన్నారు. నాణ్యతపై దృష్టి పెట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సమావేశంలోని వక్తలంతా అభిప్రాయపడ్డారు.పోలవరం విషయంపైనే పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల ఢిల్లీ వెళ్లి గడ్కరీని కలిశారు. ఈ సమయంలో గడ్కరి జలవనరుల శాఖ ఉన్నతాధికారులను పిలిపించి, పోలవరం వాస్తవ స్థితిగతులను వారికి చెప్పించారు. ఆ బృందంలో హరిబాబు బృందం లేదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా