By : Oneindia Telugu Video Team
Published : May 12, 2017, 11:33

అచ్చెన్నాయుడిపై మండిపడ్డ విష్ణుకుమార్ రాజు

ప్రధాని నరేంద్ర మోడీని వైఎస్ జగన్ కలిసిన విషయమై ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోడీ, వైఎస్ జగన్ కేసుల గురించి మాట్లాడుకోవడం మంత్రి అచ్చెన్నాయుడు చూశారా? అని ప్రశ్నించారు. మోడీపైన, జగన్ పైన అనవసర ఆరోపణలతో టీడీపీ నాయకులు తమ స్థాయిని తగ్గించుకోవద్దని హితవు పలికారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా