By : Oneindia Telugu Video Team
Published : May 08, 2017, 02:42

bjp దూకుడు రెడీ @ తెలంగాణ

తెలంగాణలో కమలనాధులు తమ పోరాటాన్ని ముమ్మరం చేసేందుకు రెఢీ అయ్యారా..? పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వెళుతున్న బీజేపీ... టీఆర్‌ఎస్‌పై దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకుందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఈనేపథ్యంలోనే బీజేపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సైతం తెలంగాణ సర్కారు పనితీరును తప్పుబడుతున్నారు. మిర్చి కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని... కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలపడమే ఇందుకు నిదర్శనం. రైతులు నష్టపోతుంటే వెంటనే బోనస్‌ ప్రకటించలేదని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా