By: Oneindia Telugu Video Team
Published : August 29, 2017, 03:29

బ్లూ వేల్‌ ఛాలెంజర్‌ 'సూసైడ్‌' గేమ్‌ ప్రాణాలతో బయటపడ్డ యువకుడు...

Subscribe to Oneindia Telugu

రష్యాలో మొదలైన బ్లూ వేల్‌ ఛాలెంజర్‌.. సూసైడ్‌ గేమ్‌గా మారి 100 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఐతే గత కొన్ని రోజులుగా టీనేజర్ల పాలిట మృత్యు శాపంలా మారిన బ్లూవేల్స్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ బారిన పడి మరో బాలుడు మృతిచెందాడు. ఉత్తర ప్రదేశ్‌లోని హమీపూర్‌ జిల్లాలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని మౌదహా గ్రామానికి చెందిన పార్థ్‌సింగ్‌(13) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కుమారుడు గదిలో నుంచి బయటకు రాకపోవడం గుర్తించిన తండ్రి తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించగా.. అక్కడ తండ్రి సెల్‌ఫోన్‌ లభించింది. ఫోన్‌లో బ్లూవేల్‌ 50 ఛాలెంజ్‌ పూర్తిచేసినట్లు నమోదైంది. దీంతో బ్లూవేల్‌ బారిన పడే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా