• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 04, 2018, 07:14
    Duration : 01:45

    అమెరికా గజగజ @ బాంబ్ సైక్లోన్ !


    ఎముకలు కొరికే చలితో అమెరికా గజగజ వణికిపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు దట్టంగా కురిసిన మంచుతో నిండిపోయాయి. మరోవైపు గురువారం మంచు తుపాను విరుచుకుపడుతుందన్న హెచ్చరికతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 'బాంబ్‌ తుపాను'గా వ్యవహరిస్తున్న ఈ తుపానుతో అమెరికా ఈశాన్య ప్రాంతంలో 6 నుంచి 12 అంగుళాల మేర మంచు పడుతుందని, గంటకు 64 నుంచి 96 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌డబ్ల్యూఎస్‌) పేర్కొంది.
    అమెరికాను ‘బాంబ్ మంచు తుపాను' వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈశాన్య అమెరికా, ఆగ్నేయ అమెరికాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. రోడ్లు, రహదారులపై మంచు పేరుకుపోయింది.
    అమెరికా వీధుల్లోని వాహనాలను మంచుదుప్పటి కప్పేసింది. నదులు సైతం గడ్డ కట్టాయి. దశాబ్ధాల అనంతరం ఈ స్థాయిలో మంచుకురవడం ఇదే ప్రథమం. వారం రోజుల నుంచి నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నప్పటికీ తుపాను కారణంగా ఈ పరిస్థితి మరింత దిగజారింది. ‘‘బాంబ్ తుఫాన్' కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంచు ప్రభావిత ప్రాంతాల్లోని విమానాశ్రయ సిబ్బంది అనేక సర్వీసులను రద్దు చేస్తున్నామని ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 2,700 విమానాలు రద్దయ్యాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా