By: Oneindia Telugu Video Team
Published : May 10, 2017, 12:23

AP మంత్రి నారాయణ కొడుకు మృతి

Subscribe to Oneindia Telugu

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌ నారాయణ(22), అతడి స్నేహితుడు రవివర్మ మృతి చెందారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఇద్దరినీ అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. నిశిత్‌, అతని స్నేహితుడ్ని ఆస్పత్రికి తరలించడంలో జీహెచ్ఎంసీ సిబ్బంది సాయం అందించారు. కాగా, ఘటనాస్థలం నుంచి కారును తొలగించారు. నిశిత్ తోపాటు మృతి చెందిన రవివర్మ వ్యాపారి చినబాబు కుమారుడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా