By : Oneindia Telugu Video Team
Published : November 30, 2017, 12:50

బ్రూస్ లీ మరణం వెనుక ఉన్న రహస్యాలు : షాకింగ్ !

అతని పంచ్ పవర్ మామూలుగా ఉండేది కాదు. ఒక రేంజ్ లో ఉండేది. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మన్ గా పేరుగాంచాడు. అతనే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బ్రూస్ లీ. చాలా తక్కువ కాలంలో వరల్డ్ వైడ్ గా ఖ్యాతి సాధించిన ఇతను అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాడు. ఇతను చనిపోయిన చాలా కాలమైనా ఆ మరణానికి సంబంధించిని మిస్టరీస్ ఇప్పటికీ చాలానే వినపడుతుంటాయి. పీడ్ ఫైటింగ్ టెక్నిక్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న బ్రూస్ లీ 32 ఏళ్లకే చనిపోయాడు. ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒకసారి చూద్దాం.
నవంబర్ 27, 1940 జన్మించి జులై 20, 1973 వరకు ఉన్న బ్రూస్ లీ గురించి ప్రంపంచం మొత్తం తెలుసు. ఈయన అమెరికాలో జన్మించి హాంకాంగ్ లో పెరిగారు. బ్రూస్‌ లీ తన చిన్నతనంలో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి థామ్‌ చీ చువాన్‌ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నారు. కుంఫులో భాగమైన వింగ్‌ చున్‌ లో శిక్షణ కోసం ఇప్‌మెన్‌ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తరువాత బాక్సింగ్, డాన్సింగ్, కత్తి సాముల్లో నైపుణ్యం సాధించాడు. 18 ఏళ్ల వయస్సులోనే వీటన్నింటిని నేర్చుకున్నాడు బ్రూస్ లీ. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఒక పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆబ్జెక్ట్‌కు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more