By: Oneindia Telugu Video Team
Published : January 04, 2018, 05:06

పెట్టుబడుల పరిమితుల పెంపుకు జైట్లీ యోచన?

Subscribe to Oneindia Telugu


2018 బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త ఉండే అవకాశం ఉందని సమాచారం. సెక్షన్ 80 సీ కింద పెట్టుబడుల పరిమితిని ఏడాదికి రూ. లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.బడ్జెట్‌లో ఈ ఏడాది వేతన జీవులకు ప్రయోజనం కల్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉండే అవకాశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారంగా తెలుస్తోంది. ఆదాయ పన్ను మినహయింపు పరిమితిని కూడ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.అయితే ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సిన అవసరం మాత్రం ఉంది.
పన్ను చెల్లింపు దారులకు వెసులుబాటును కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. సెక్షన్ 80 సీ కింద పెట్టుబడుల పరిమితిని ఏడాదికి రూ. 2 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. ఒకవేళ ప్రభుత్వం ఇదే నిర్ణయాన్ని తీసుకొంటే రూ.2 లక్షల వరకున్న బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి పెట్టుబడులకు పన్ను చెల్లించవసరం లేదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా