By: Oneindia Telugu Video Team
Published : January 18, 2018, 03:12

వేతన జీవులకు ఊరటే ! భారీగా పెరగనున్న ఆదాయ పరిమితి

Subscribe to Oneindia Telugu

వేతన జీవులకు ఈ ఏడాది బడ్జెట్లో గొప్ప ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఇది చివరి సాధారణ బడ్జెట్‌ కానుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును, పన్ను శ్లాబులను పెంచే దిశగా ఆర్థిక శాఖ యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపును 2.5లక్షల నుంచి 3లక్షలకు లేదా 5లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రభావం పడుతున్న వేతన జీవుల కోసం ఈ చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పన్ను శ్లాబులలో మార్పులు చేయనప్పటికీ.. తక్కువ పన్ను చెల్లింపుదార్లకు ఊరటనిచ్చారు. రూ.2.5-5 లక్షల మధ్య వార్షికాదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
రూ.10-20 లక్షల ఆదాయ వర్గాల కోసం.. వచ్చే నెల 1న ప్రకటించే తదుపరి బడ్జెట్లో రూ.5-10 లక్షల ఆదాయ వర్గాలకు 10%; రూ.10-20 లక్షల ఆదాయ వర్గాలకు 20%; రూ.20 లక్షల పైబడిన వారికి 30 శాతంగా పన్ను రేట్లను విధించొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.10-20 లక్షల ఆదాయ వర్గాలకు ఎటువంటి శ్లాబు లేదు. 'ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని; ఇతర ఆదాయ శ్లాబులను పెంచాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల్లో గరిష్ఠ పన్ను రేటుకు సంబంధించిన ఆదాయం చాలా ఎక్కువగా ఉందన్న విషయాన్ని గమనించాల'ని పరిశ్రమ సంఘం సీఐఐ తన ముందస్తు బడ్జెట్‌ మెమొరాండంలో పేర్కొంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా