• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 20, 2018, 05:36
    Duration : 02:16

    2018లో బడ్జెట్.. ఇల్లు కొనుగోళ్లపై రాయితీ ఆప్షన్లు..!

    కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు మరో 11 రోజుల గడువు ఉన్నది. అయితే ఈలోగా వివిధ రంగాలు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, నిపుణులు తమకు రాయితీలు కల్పించాలని కోరడం ఆనవాయితీ. అలాగే సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారూ తమకు ఒకింత వెసులుబాటు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనల్లో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా స్వల్ప ఊరటనిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు రుణాల ద్వారా కొనుగోలు చేసే ఇళ్లపై వడ్డీ భారం తగ్గించాలన్న అభ్యర్థనలు వెలువడుతున్నాయి.
    సొంతిల్లు కట్టుకున్నవారైనా, కొనుగోలు చేసిన వారైనా ఆదాయం పన్ను చట్టం (ఐటీ యాక్ట్)లోని 80 - సీ నిబంధన కింద పన్ను చెల్లింపులో రూ.50 వేల నుంచి అంతకంటే ఎక్కువ మినహాయింపు పొందొచ్చు. ప్రస్తుతం ఇంటి రుణాలు తీసుకున్న వారికిది వర్తిస్తుంది. కొత్తగా తీసుకున్న రుణాలపై అదనపు రాయితీలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం సొంతిల్లు కొన్న వారు తమ రుణంపై రూ.2 లక్షల వరకు వడ్డీ మినహాయింపు లభిస్తుంది.
    ఉదాహరణకు రూ.40 లక్షల రుణాలపై 15 ఏళ్లకు 8.35 శాతం వడ్డీ వసూలు చేశారు. తొలి రెండేళ్లలో సుమారు రూ.3.28 లక్షలు, రూ.2.90 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి వారికి వడ్డీపై పన్ను రాయితీ ఇచ్చి వారికి వెసులుబాటు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇంటికి రుణం తీసుకున్నట్లైతే నిర్మాణం పూర్తి కాకముందు భాగాన్నిఐదు సమాన భాగాలుగా విభజిస్తారు. ఇందులో ఐదో వంతు వడ్డీరేటును పన్ను నుంచి మినహాయించేందుకు వీలు ఉంది. ఇంటిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి రుణ వసూళ్లు ప్రారంభం అవుతాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా