By: Oneindia Telugu Video Team
Published : February 06, 2018, 03:02

ఎంపీల 'గోవిందా.. గోవిందా' @పార్లమెంటు

Subscribe to Oneindia Telugu

ఏపీకి హామీల విషయంలో టీడీపీ ఎంపీలు పార్లమెంటు లోపల, బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ నారదుడి వేషంలో నిరసన తెలిపారు. తల వెంట్రుకలకు పిలక వేసుకొని, రిబ్బన్ కట్టుకొని, మెడలో పూలమాల, చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జెలు కట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. టీడీపీ సభ్యులు గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతుంటే 'ఓం నమో నారా' అంటూ శివప్రసాద్ నిసన తెలిపారు. ఏపీ విభజన హామీల అంశంపై కేంద్రమంత్రి అనంత్ కుమార్ లోకసభలో స్పందించారు. ఓ వైపు లోకసభ జరుగుతుండగా టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. వెల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. సేవ్ ఏపీ అంటూ నినాదాలు చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసన మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా