By : Oneindia Telugu Video Team
Published : July 04, 2017, 02:39

తాత ను గాలికొదిలేసిన బుమ్రా .... పాపం ఆటో నడుపుతూ ఇలా..

జస్‌ప్రీత్‌ బుమ్రా.. ప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక ఆటగాడు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. బుమ్రా బీసీసీఐ గ్రేడ్‌ బి కాంట్రాక్టు ఆటగాడిగా ఉన్నాడు. అంటే ఏడాదికి కోటి రూపాయల వేతనం లభిస్తుందన్నమాట.భారత జట్టులో కీలక ఆటగాడైన జస్ ప్రీత్ బుమ్రాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనను చిన్నతనంలో పెంచి, ఆలనా పాలనా చూసిన బుమ్రా తాతయ్య, సంతోఖ్ సింగ్ ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో పూటగడవి పరిస్థితుల్లో ఉండగా, ఏడాదికి కోటి రూపాయల వేతనంతో పాటు, ఒక్కో టెస్టుకు రూ. 15, లక్షలు, వన్తేకు రూ. 6 లక్షలు, టీ-20కి రూ. 3 లక్షలు తీసుకుంటున్న బుమ్రా, ఒక్క రూపాయి కూడా తాతయ్యకు సాయం చేయడం లేదు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా