By: Oneindia Telugu Video Team
Published : October 30, 2017, 07:19

మ్యాచ్‌ని మలుపు తిప్పిన బుమ్రా ..

Subscribe to Oneindia Telugu

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో వన్డేలో కోహ్లీసేన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం కాన్పూర్‌లోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచిన ఓ సన్నివేశాన్ని బీసీసీఐ తన ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేసింది. ఈ వీడియోలో ధోని తెలివిగా బుమ్రాకి బంతిని అందించడం నుంచి... బుమ్రా ఆ బంతిని నేరుగా వికెట్లకేసి కొడుతూ కివీస్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్‌ రనౌట్ అవడం వరకు అందులో ఉంది.
ముఖ్యంగా ఈ రనౌట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చవేసిందని చెప్పాలి. మూడో వన్డేలో మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన న్యూజిలాండ్ ఒకానొక సందర్భంలో భారత్ నిర్దేశించిన 338 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. అంతేకాదు టామ్ లాథమ్ క్రీజులో ఉన్నంత వరకు కివీస్ గెలుపు ధీమాతో ఉంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా