By : Oneindia Telugu Video Team
Published : February 16, 2018, 12:23

కావేరీ తీర్పు: బెంగళూరులో టైట్ సెక్యూరిటీ

కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తుదితీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించారు. బెంగళూరు నగరంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ చెప్పారు. బెంగళూరులో సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు మొహరిస్తున్నాయి.
కావేరీ నీటి పంపిణి విషయంలో పొరుగు రాష్ట్రాలు అయిన కర్ణాటక, తమిళనాడు దశాభ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. నీరు విడుదల చెయ్యాలని తమిళనాడు, మాకే నీళ్లు లేవని కర్ణాటక న్యాయపోరాటం చేస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటకతో పాటు కేరళ కూడా కావేరీ నీటి కోసం కోర్టును ఆశ్రయించింది
బెంగళూరు నగరంలో దాదాపు 30 లక్షల మంది తమిళ ప్రజలు నివాసం ఉంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తమిళ ప్రజలు బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్నారు. కావేరీ నీటి పంపిణి తీర్పు ఎలా వస్తుందో అంటూ తమిళ ప్రజలు హడలిపోతున్నారు.
కావేరీ నీటి పంపిణి విషయంలో తీర్పు ఎలా వచ్చినా బెంగళూరులో గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో గట్టి నిఘావేశారు. బెంగళూరు నగరంలో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు మొహరిస్తున్నాయి.
బెంగళూరు నగరంలోని హలసూరు, టిన్ ఫ్యాక్టరీ, విజనాపుర, కేజీహళ్ళి, డీజేహళ్లి, శివాజీనగర, అంజనప్ప గార్డెన్, మెజస్టిక్ సమీపంలోని శ్రీరాంపుర, శాంతినగర, కేఆర్ మార్కెట్, కాటన్ పేట, చామరాజపేట, జయనగర 9 బ్లాక్, జేపీ నగర్, జయమహల్, ఆర్ టీ నగర్, నాగవార, హెబ్బాళ, కేఆర్ పురం, రామమూర్తి నగర్, బాణసవాడి, అంజనప్ప బ్లాక్ తదితర ప్రాంతాల్లో లక్షల మంది తమిళ ప్రజలు నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా వేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా