By: Oneindia Telugu Video Team
Published : October 27, 2017, 03:14

కాంగ్రెస్ 'చలో అసెంబ్లీ' వాడీ వేడి

Subscribe to Oneindia Telugu

కాంగ్రెస్ 'చలో అసెంబ్లీ' వాడీ వేడి
తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందని ఆరోపిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో అసెంబ్లీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గాంధీభవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అక్కడికి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్నారు.మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీ లోనికి అనుమతి ఇస్తున్నారు.వివిధ జిల్లాల నుంచి వచ్చే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టుల పట్ల కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రైతుల సమస్యలపై చర్చను వెంటనే చేపట్టాలని, అక్రమ అరెస్టులను ఆపాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా