By: Oneindia Telugu Video Team
Published : June 19, 2017, 02:59

ఇండియా ఓడిపోవడానికి 5 కారణాలు

Subscribe to Oneindia Telugu

పిచ్చ ఫాం లో ఉన్న మన టీం ఇండియా, పాకిస్తాన్ జట్టుని ఉతికి ఆరేసి ఛాంపియన్స్ కప్పుతో తిరిగొస్తారనుకుంటే కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. లీగ్ దశలో పాకిస్తాన్ ను చిత్తుచిత్తుగా ఓడించిన టీంఇండియా, ఫైనల్ కి వచ్చే సరికి అంతకన్నా చిత్తుగా ఓడిపోయింది. భారత్ చేతుల్లోంచి ఈ మ్యాచ్ ఎలా చేజారిపోయింది అంటే..
పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే విపరీతమైన వత్తిడి ఉంటుంది అని తెలుసు. అంత వత్తిడిలో భారీ టార్గెట్ చేదించడం కష్టం అని తెలుసు అయినా టాస్ గెలిచిన కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకుని తప్పు చేసాడు. సెకండ్ బ్యాటింగ్ తీసుకునే మనవాళ్ళు ఇప్పటి దాకా గెలుస్తున్నా, ఈ మ్యాచ్ లో ఉండే వత్తిడి, బ్యాటింగ్ పిచ్ కావడం ఈ రెండిటి దృష్ట్యా కోహ్లి, పాకిస్తాన్ కు బ్యాటింగ్ ఇవ్వడం మొదటి తప్పు. ఈ నిర్ణయం కారణంగా మనం 30% మ్యాచ్ కోల్పోయాం. .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా