By: Oneindia Telugu Video Team
Published : June 13, 2017, 03:19

ఫైనల్ లో మళ్ళీ సేమ్ టీం లు రిపీటా?

Subscribe to Oneindia Telugu

ఇంగ్లండ్ వేదికగా జరుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో గత ట్రోఫీలో ఫైనల్ ఆడిన జట్లే ఈసారి కూడా ఫైనల్ ఆడనున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశ పోటీలు ముగిశాయి. లీగ్ దశలో నాలుగేసి పాయింట్లు సంపాదించిన ఇంగ్లండ్, బంగ్లాదేశ్ గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్ చేరగా, గ్రూప్ బి నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీస్ లో చోటు సంపాదించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14న తొలి సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ తో పాకిస్థాన్ తలపడనుండగా, 15న భారత్ తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ మ్యాచ్ లలో ఏవో అద్భుతాలు జరిగితే తప్ప ఇంగ్లండ్, భారత్ లను అడ్డుకోవడం ఆ రెండు జట్లకు సాధ్యం కాదు. గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్, ఇంగ్లండ్ తలపడగా, భారత్ విజేతగా ఆవిర్భవించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా