By: Oneindia Telugu Video Team
Published : June 15, 2017, 11:12

ఇంగ్లాండ్ vs పాక్ మ్యాచ్ హైలైట్స్

Subscribe to Oneindia Telugu

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఫేవరెట్‌ ఇంగ్లండ్‌. దీనికి న్యాయం చేస్తూ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచి అందరికంటే ముందే సెమీస్‌ చేరింది. కానీ! అసలు సమరంలో బ్యాట్లెత్తేసింది.చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో సంచలన విజయంతో పాకిస్థాన్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని ఆ జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ట్రోఫీలో తొలి నుంచి దుమ్మురేపుతున్న ఇంగ్లండ్ కీలక మ్యాచ్‌లో చతికిల పడింది. పాక్ బౌలర్ల దెబ్బకు మరో బంతి మిగిలి ఉండగానే 211 పరుగులకు కుప్పకూలి ప్రత్యర్థి ముందు స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ చేసిన అతి తక్కువ పరుగులు ఇవే. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 37.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించిన పాక్ బౌలర్ హసన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా