By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 02:49

శశికళ సీఎం అవ్వాలంటే..

Subscribe to Oneindia Telugu

శశికళ చక్రం తిప్పుదామనుకుంటే... జైలు అనే చట్రంలో ఇరుక్కుపోయారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలనుకుంటే... దోషిగా జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. మూడున్నరేళ్ల తర్వాత జైలునుంచి బయటకు వచ్చినా... ఆమె ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు అర్హతలేదు. కోర్టు తీర్పు ప్రకారం... పదేళ్లు ఎలాంటి ఎన్నికల్లో ఆమె పాల్గొనేందుకు వీలు లేదు. అంటే ప్రస్తుతం పళని స్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల వరకూ ఆయనే కొనసాగురు. వచ్చే ఎన్నికలు ముగిసే నాటికి... చిన్నమ్మ జైలు నుంచి బయటకు వస్తారు. అప్పుడు మళ్లీ పళని స్వామే ముఖ్యమంత్రిగా ఉంటారో.. లేక ప్రత్యర్థి పార్టీ బలం పుంజుకుని అధికారం దక్కించుకుంటుందా అనే విషయం కాలమే నిర్ణయిస్తుంది. శశికళ జైల్లో కూర్చుని ఎంత చక్రం తిప్పినా... పళని స్వామి ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ఓటర్‌ మైండ్‌ సెట్‌ ప్రకారమే... వచ్చే ఎన్నికల్లో అన్నా డీఎంకేకు అధికారం దక్కుతుందా లేదా అనేది అర్ధమవుతుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా