By : Oneindia Telugu Video Team
Published : March 22, 2018, 04:59

పవన్ అవగాహనా లేకుండా మాట్లాడ్తున్నాడు

పట్టిసీమపై కాగ్ రిపోర్ట్‌ ఆధారంగా కేసులు పెడతారా అని బిజెపి నేతలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు.నిన్నటివరకు తమ ప్రభుత్వంపై కన్పించని అవినీతి ఇప్పుడెలా కన్పించిందని బాబు ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.
ఏపీ అసెంబ్లీలో గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొనే ప్రయత్నాలను చేస్తున్నారని ఆయన చెప్పారు.
పట్టిసీమపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా కేసులు వేస్తారా అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై కూడ కాగ్ రిపోర్ట్‌లో అనేక తప్పులను ఎత్తి చూపుతోందని బాబు ప్రస్తావించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా మోడీ ప్రభుత్వంపై కూడ కేసులు వేస్తారా అని బాబు ప్రశ్నించారు. ఇంతకాలం పాటు తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయని బిజెపి నేతలు ఇప్పడే ఎందుకు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని బాబు ప్రశ్నించారు.
మరో వైపు పోలవరం పునరావాసంపై పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.
పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కూడ ఇదే తరహలో ప్రజలను రెచ్చగొట్టారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.గోదావరి నీళ్ళను రాయలసీమకు తరలిస్తున్నారని ప్రజలను కొందరు రెచ్చగొట్టారని వైసీపీ నేత జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏపీలోని16 ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని ఆయన చెప్పారు. కుప్పం నియోజకవర్గానికి కంటే ముందుగానే పులివెందుకు నీళ్ళిచ్చినట్టుగా బాబు గుర్తు చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా