By : Oneindia Telugu Video Team
Published : April 05, 2018, 04:00

పవన్ కళ్యాణ్‌పై టీడీపీ గుర్రు..!

రాజకీయ నాయకులు ఎవరైనా తమ పార్టీ బలంగా ఉందని చెబుతారని,కానీ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మాణిక్యాల రావు మాత్రం పవన్‌ కళ్యాణ్ బలంగా ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు.పవన్‌ వెనుక బీజేపీ ఉందన్న విషయం మాణిక్యాల రావు మాటలతో తేలిపోయిందన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందినవారిలో 80 శాతం మంది పవన్‌ వెనుక ఉన్నారని మాణిక్యాల రావు చెప్పడంలో అర్థం లేదన్నారు. ముద్రగడ పద్మనాభం వెనుక ఎంతమంది కాపులున్నారో, పవన్‌ వెనుకా అంతేమంది ఉన్నారని చెప్పారు.
విభజన సయంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ, అధికారం చేపట్టాక ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో దగాకోరు రాజకీయాలు చేస్తోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు వేరుగా మండిపడ్డారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ విషయంపై మాట్లాడక తప్పడం లేదన్నారు.హోదా ధర్మ పోరాటానికి 5కోట్ల మంది ప్రజలు రాజకీయాలకు అతీతంగా సిద్ధం కావాలని కోడెల పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రస్తుతం దళితవర్గాలపై దాడులు 65 శాతం పెరిగాయన్నారు. మరోవైపు, చంద్రబాబు రెండురోజుల ఢిల్లీ పర్యటన విజయం సాధించిందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.
ఒక్క రోజులో చంద్రబాబు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో దాదాపు 25 పార్టీలకు చెందిన ఫ్లోర్‌ లీడర్లు, 50మందికి పైగా ఎంపీలతో కలిసి మాట్లాడటం మంచి పరిణామం అని టీడీపీ పేర్కొంది.ఎన్డీయే మిత్రపక్షాలు,బీజేపీలోని కొందరు వ్యక్తులు భయపడకుండా వచ్చి చంద్రబాబుతో మాట్లాడటం,ఫొటోలు దిగడం సాధారణ విషయం కాదన్నారు.మోడీ ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు, పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో వివరించడం ద్వారా టీడీపీ వాదనలో బలం ఉందని చాటి చెప్పారన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా