By: Oneindia Telugu Video Team
Published : August 29, 2017, 04:57

రాజీనామా పై జగన్ కు చంద్రబాబు సవాల్

Subscribe to Oneindia Telugu

నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ జగన్‌ తన పార్టీ ఎంపిలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడితే తాము అక్కడ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వ్యాఖ్యానించారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం చంద్రబాబు సచివాలయంలో మీడియాతో ఉత్సాహంగా మాట్లాడారు. ‘నంద్యాల ఫలితం తర్వాత కూడా జగన్‌ ఎన్నికలంటూ ఊరేగుతున్నారు. పార్లమెంటు సమావేశాలు అయ్యాక ప్రత్యేక హోదా కోసం మీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలతో జూన్‌లో రాజీనామా చేయిస్తా అన్నారుగా.. ఆగస్టు వచ్చింది. మీ ఎంపీలతో రాజీనామా చేయించండి. విశ్వసనీయతకు మారు పేరు.. మాట తప్పను.. మడమ తిప్పను అంటారుగా.. మాటపై నిలబడండి' అని సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌కు సవాల్‌ విసిరారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా