By: Oneindia Telugu Video Team
Published : November 02, 2017, 04:32

బాబుకు రేవంత్ షాక్: జగన్‌కు లాభమే

Subscribe to Oneindia Telugu

తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే విషయమై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం నాడు పార్టీ నేతలతో చర్చించనున్నారు. రేవంత్‌తో పాటు కీలక నేతలు పార్టీని వీడి వెళ్ళిన నేపథ్యంలో చోటుచేసుకొన్న పరిణామాలపై బాబు చర్చించనున్నారు.దీంతో పాటుగా రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాపై ఏం చేయాలనే దానిపై కూడ పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించనున్నారు.తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. భవిష్యత్‌లో ఈ రకమైన ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడ పార్టీ నేతలతో బాబు చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మరో వైపు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకర్గాల ఇంచార్జీల ఖాళీలను భర్తీ చేయనున్నారు. కొత్త నాయకత్వాన్ని పార్టీలోకి వచ్చేలా చేయాలని ఆ పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు తమకు అనుకూలంగా వినియోగించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది టిడిపికి ఇబ్బందికర పరిణామంగానే కన్పిస్తోందంటున్నారు విశ్లేషకులు.పార్టీకి రాజీనామా చేసే సమయంలో ఎమ్మెల్యే పదవికి కూడ రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను రేవంత్‌రెడ్డి పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడుకు అందించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా