By: Oneindia Telugu Video Team
Published : December 02, 2017, 11:07

పోలవరంపై ఇదంతా డ్రామా !

Subscribe to Oneindia Telugu

ఏపీలో పోలవరం ప్రాజెక్టుపై పెద్ద వివాదమే రేగుతోంది. ప్రాజెక్టు పట్ల కేంద్రం అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తుందన్న తరహాలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం బీజేపీకి మంటపుట్టించింది.
సీఎం వ్యాఖ్యలకు బీజేపీ నుంచి కౌంటర్స్ రావడం.. టీడీపీ నేతలు వాటిని తిప్పికొట్టడంతో వివాదం మరింత పెరిగింది. ఇదిలాగే కొనసాగితే రెండు పార్టీల మధ్య అగాథం టీడీపీకే దెబ్బ కాబట్టి తమ పార్టీ నేతలను సంయమనం పాటించాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు వైఖరి చర్చనీయాంశంగా మారింది. పోలవరం విషయంలో బీజేపీని తొలుత ఆయనే టార్గెట్ చేసి ఇప్పుడు పార్టీ నేతలను మాత్రం సంయమనం పాటించాలని కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలవరంపై వివాదం ముదురుతున్న తరుణంలో అటు వైసీపీ నేతలు కూడా కీలక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
2019 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని తెలుసుకున్న చంద్రబాబు.. కేంద్రంపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు చేపట్టారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా పోలవరం భూసేకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా