By: Oneindia Telugu Video Team
Published : November 03, 2017, 03:17

పుజారా @ 12 డబుల్ సెంచరీలు

Subscribe to Oneindia Telugu

టీమిండియా క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధికంగా డబుల్‌ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా సరికొత్త రికార్డు సృష్టించాడు. జార్ఖండ్‌ జట్టుతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో గురువారం అతడు ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో పుజారా 28 ఫోర్లు సాయంతో 204 పరుగులు చేశాడు. దీంతో తన కెరీర్లో 12వ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న దిగ్గజ క్రికెటర్‌ విజయ్‌ మర్చంట్‌ (11) రికార్డుని బద్దలు కొట్టాడు. సునీల్‌ గవాస్కర్‌, విజయ్‌ హజారే, రాహుల్‌ ద్రవిడ్‌లు పదేసి డబుల్‌ సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
వీరిలో మూడు ట్రిఫుల్‌ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ పుజారానే కావడం విశేషం. అతడితో సమానంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మాత్రమే మూడు ట్రిఫుల్‌ సెంచరీలు బాదాడు. ప్రస్తుతం రంజీ క్రికెట్‌లో పుజారా సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో పుజారా (355 బంతుల్లో 204) డబుల్‌ సెంచరీ చేయడంతో సౌరాష్ట్ర భారీ స్కోరు చేసింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా