• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 18, 2020, 12:50
    Duration : 01:52

    ఎవర్నో మెప్పించడానికి నేను ఆడడం లేదు !

    ఎవర్నో మెప్పించడం తన లక్ష్యం కాదని, భారత జట్టును గెలిపించడమే తన కర్తవ్యమని టెస్ట్ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా తెలిపాడు. టెస్టుల్లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని టీమిండియా నయావాల్‌గా పేరుగాంచిన ఈ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్.. ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు.దీంతో సోషల్‌మీడియా వేదికగా అతని బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే విషయంపై ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడిన పుజారా తాను సోషల్‌ మీడియాలో విమర్శించే వారికోసం ఆడనని స్పష్టం చేశాడు. చాలా మందికి తన ఆట అర్థం కాదని, ఎందుకంటే వాళ్లంతా పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే చూస్తారన్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా