By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

నేను పత్రికలో వ్యాసం రాయలేదు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తాను పోతిరెడ్డిపాడుకు అనుకూలంగా ఏ పత్రికలో వ్యాసం రాయలేదని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తాను ఏనాడూ సమర్థించలేదని, ఈ ప్రాజెక్టును సమర్థిస్తున్నట్లుగా తన పేరుతో ఒక దినపత్రికలో వచ్చిన వ్యాసాన్ని తాను రాయలేదన్నారు. ఆ పత్రికలో వచ్చిన వ్యాసం కనుక తాను రాసినట్లు నిరూపిస్తే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఏబీఎన్ మీద పొగడ్తలు కురిపిస్తున్న నిరంజన్ రెడ్డి, ఆ చానల్‌‌ను బ్యాన్ చేసినప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. నిరంజన్‌ రెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు కల్వకుర్తి ప్రాజెక్టు గురించి మాట్లాడారా అని నిలదీశారు. సిమెంట్, స్టీల్ దొంగిలించి ఇల్లు కట్టుకున్న చరిత్ర నిరంజన్‌రెడ్డిదని విమర్శించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా