By: Oneindia Telugu Video Team
Published : November 09, 2017, 11:53

చిరంజీవి ఇంట్లో చోరీ తో "జల్సా"

Subscribe to Oneindia Telugu

టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడి నుంచి రూ.1.50లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బుధవారం అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.25లో నివసిస్తున్న చిరంజీవి ఇంట్లో కర్నూలుకు చెందిన చెన్నయ్య(28) 10సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. రాజీవ్ నగర్ లో నివాసముండే ఇతను.. చిరంజీవి ఇంటి ఆవరణలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోసం చిరంజీవి సిబ్బంది నుంచి కార్యాలయానికి డబ్బులు అందుతుంటాయి. ఇదే క్రమంలో అక్టోబర్ 30న ఖర్చుల నిమిత్తం రూ.4లక్షలను మేనేజర్ గంగాధర్ రావుకు ఇచ్చారు. ఆ డబ్బును గంగాధర్ రావు అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోని టేబుల్ లో పెట్టాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా