By : Oneindia Telugu Video Team
Published : April 20, 2018, 06:58

IPL 2018: గేల్ 6 6 6 6 2

ఐపీఎల్‌లో మళ్లీ మొదలైంది గేల్‌ తుఫాన్‌! టి20ల్లో తానెంతటి విశిష్ట ఆటగాడో చాటుతూ, తనను తీసుకోకపోవడం ఎంత తప్పో ఇతర జట్లకు చెబుతూ, తన బ్యాట్‌ పదును తగ్గలేదని చూపుతూ... అతడు విరుచుకు పడ్డాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో కింగ్‌లా నిలిచి... వరుస విజయాల ఊపులో ఉన్న సన్‌రైజర్స్‌ను పరాజయం పాల్జేశాడు. రెండు జట్ల మధ్య గురువారం ఇక్కడ జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో గేల్‌ (63 బంతుల్లో 104 నాటౌట్‌; 1 ఫోర్, 11 సిక్స్‌లు) గేల్‌ ఒక ఇన్నింగ్స్‌లో పదికి పైగా సిక్సర్లు బాదడం ఇది 16వ సారి. మరో నలుగురు ఆటగాళ్లు మాత్రమే గరిష్టంగా రెండు సార్లు ఈ ఘనత సాధించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా