By: Oneindia Telugu Video Team
Published : May 09, 2017, 04:26

త్వరలో ap లో సిస్కో Cisco Services At Amaravati Soon

Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ' సిస్కో' తన సేవలను ప్రారంభించేందుకు సంసిద్దతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడుకు ఆ కంపెనీ సిఈఓ జాన్ చాంబర్స్ ఈ మేరకు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులు, మంత్రుల బృందంతో కలిసి అమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనపై వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. చంద్రబాబునాయుడు అమెరికా టూర్ లో రాష్ట్రానికి ఒనగూరిందేమీలేదంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిస్కో కంపెనీ సిఈఓతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో సిస్కోతో పాటుగా మరో 30 కంపెనీలకు చెందిన సిఈఓలు కూడ పాల్గొన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా