By : Oneindia Telugu Video Team
Published : January 06, 2017, 08:25

విద్యుత్‌ రంగంలో తెలంగాణ ముందడుగు

విద్యుత్‌ రంగంలో తెలంగాణ ముందడుగు వేసిందని, కొత్త రాష్ట్రం ఏర్పడేనాటికి 2700 మెగావాట్ల విద్యుత్‌ లోటుతో ఉన్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. అసెంబ్లీలో విద్యుత్‌ పై చర్చలో భాగంగా సీఎం మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో విద్యుత్‌ కొరతతో పంటలు ఎండిపోయాయని, పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి అడుగులోనే విద్యుత్ కొరతను పెను సవాల్‌గా తీసుకుని జెన్‌కో ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి పెంచి సమస్యను అధిగమించామని చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా