By: Oneindia Telugu Video Team
Published : January 04, 2017, 04:13

చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు

Subscribe to Oneindia Telugu

వచ్చే రెండేళ్లలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్‌లో మత్స్య పరిశ్రమకు నిధులు పెంచుతామని ప్రకటించారు. మంగళవారం శాసనసభలో మత్స్య పరిశ్రమపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపల పరిశ్రమ అంటే కోస్తాంధ్రగా వ్యవహరించారని తెలిపారు..వచ్చే సంవత్సరానికే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి తెస్తామని సీఎం స్పష్టం చేశారు. 11 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఐదున్నర వేల కోట్ల చేప పిల్లలను పెంచే అవకాశం ఉందన్నారు. వచ్చే రెండేళ్లలో రెండు ఫిషరీస్ కళాశాలలు, రెండు రిసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా