By : Oneindia Telugu Video Team
Published : December 21, 2017, 11:02

ప్రపంచ తెలుగు మహాసభలు : సీఎం కేసీఆర్ స్పీచ్ !

ఐదు రోజులు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భాగ్యనగరంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల ముగింపు వేడుక‌లకు భాషాభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఈ స‌భ‌లు నిర్వ‌హించిన కేసీఆర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ. తెలుగు మహాసభలు విజయంతమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇకపై ప్రతీ ఏడాది డిసెంబర్‌లో రెండు రోజులపాటు తెలంగాణ తెలుగు సభలు నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు పరిరక్షణలో భాగంగా ఇప్పటికే విద్యాసంస్థల్లో తెలుగును తప్పనిసరి చేశామన్నారు. ఈ గడ్డపై చదువుకోవాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. రిటైర్డ్ భాషాపండితుల పెన్షన్లలో కోత లేకుండా చేస్తామన్నారు. ఈ మహాసభల ద్వారా తెలుగు భాష పరిరక్షణకు అనేక సూచనలు అందాయని, వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జనవరి మొదటివారంలో భాషా సాహితీవేత్తల సదస్సు నిర్వహిస్తామని చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా