By: Oneindia Telugu Video Team
Published : January 02, 2017, 03:29

మోడీపై సురవరం తీవ్ర ఆగ్రహం

Subscribe to Oneindia Telugu

భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెనుక నల్లధనం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు చేసి సాధించిందేమీ లేకపోగా.. పేదలు, మధ్యతరగతి ప్రజల్ని మరింత సమస్యల్లోకి నెట్టారని విమర్శించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌ లో ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అహ్మదాబాద్‌ లో నోట్ల మార్పిడి జరిగిందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు ఆరోపిస్తే ప్రధానమంత్రి ఇంతవరకు జవాబు చెప్పలేదన్నారు. నోట్ల రద్దు తర్వాత కొత్తనోట్లు వచ్చాయని, ఇవి వెంటనే నల్లధనంగా ఎలా మారాయని సుప్రీంకోర్టు సర్కారును ప్రశ్నిస్తే జవాబు లేదన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా