By: Oneindia Telugu Video Team
Published : January 22, 2018, 05:10

సిపిఎంలో చిచ్చు: సీతారాం ఏచూరి రాజీనామా రెడీ ?

Subscribe to Oneindia Telugu

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి పార్టీలో అనూహ్యమైన ఎదురు దెబ్బ తగిలింది. సి‌పిఎంలో కాంగ్రెసు చిచ్చు రగిలింది. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే విషయంపై కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడంలో ఆయన రెండోసారి విఫలమయ్యారు. ఏచూరి చేసిన ప్రతిపాదనను కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన కేంద్ర కమిటీ ఓటింగులో 55 - 31 తేడాతో ఏచూరి చేసిన ప్రతిపాదన వీగిపోయింది.
తన ప్రతిపాదనను కేంద్ర కమిటీ తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన సీతారాం ఏచూరి రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే, ఏచూరిని కొనసాగించాల్సిందిగా పోలీట్ బ్యూరో, కేంద్ర కమిటీ కోరింది. దాంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే, ఏప్రిల్‌లో హైదరాబాదులో జరిగే ఆంతరంగిక సమావేశంలో దానిపై తేల్చుకునేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.
2019లో జరిగే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సిపిఎం ఆరు నెలల క్రితం ప్రతిపాదన చేసింది. పార్టీ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి బిజెపి వ్యతిరేక కూటమితో చేతులు కలపాలని ఏచూరి ప్రతిపాదించారు. అయితే, అది ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని, పార్టీ నైతిక విలువలు దెబ్బ తింటాయని అంటూ కాంగ్రెసు పార్టీవి మోసపూరిత రాజకీయాలంటూ ప్రకాశ్ కారత్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా