By: Oneindia Telugu Video Team
Published : December 20, 2017, 12:23

అమరావతి నిర్మాణం ఎంతవరకూ వచ్చిందంటే ?

Subscribe to Oneindia Telugu


అమరావతి డిజైన్లను ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఫైనల్ చేసింది. అయితే ఈ డిజైన్ల ఎంపిక కోసం సినీ దర్శకుడు రాజమౌళి సహకారం కూడ తీసుకొన్నారు. అమరావతి లో అసెంబ్లీ భవనానికి టవర్ ఆకృతిని ఫైనల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే CRDA తాజాగా అమరావతి నిర్మాణం పనులకు సంబందించిన వీడియో ఒకటి విడుదల చేసారు. ఏ పని ఎంతవరకూ వచ్చిందనే విషయం తెలియచేస్తూ అన్ని డిజైన్ల కూ పనులకు సంబందించిన విసువల్స్ చూపిస్తూ ఆ వీడియో ఉంది.
విశేష మద్దతు పొందిన టవర్‌ డిజైన్‌లో అసెంబ్లీ భవంతి 750 చదరపు అడుగుల వెడల్పు కలిగి ఉండాలని ప్రతిపాదించారు. సుమారు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది.చుట్టూ ఉన్న తటాకంలో దీని ప్రతిబింబం కనపడుతుంది. ఈ టవర్‌లో 70 మీటర్ల ఎత్తు వరకు (70 అంతస్తులు) సందర్శకులు వెళ్లవచ్చు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అడుగడుగునా ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని భవన నిర్మాణ ఆకృతులపై ప్రజల మాట తెలుసుకోవాలని నిర్ణయించింది. భవన సముదాయ డిజైన్ల విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో డిజైన్లను సోసల్ మీడియాలో ఉంచారు. ఇక చంద్ర బాబు ఆలోచనా విదానానికి చాలామంది అబినందిస్తున్నారు కూడా. అలాగే కొండవీటి వాగు వల్ల ఇప్పటివరకు వరద ముప్పుతో ఇబ్బందులు పడ్డారు.. ఇక ముందు రాజధాని ప్రాంతంలో వరద ముప్పు వల్ల ప్రజలకు ఇబ్బంది వుండదు. కొండవీటి వాగుతో లాభాలను చూస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే తెలిపారు. గత వంద సంవత్సరాల నుంచి కొండవీటి వాగు ముంపు వల్ల అనేక వేల ఎకరాలలో పంటనష్టం జరిగింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా