అతను టెస్టుల్లో అత్యుత్తమ భారత వికెట్ కీపర్ కం బ్యాటర్
Published : July 02, 2022, 05:30
ఈ సెంచరీ దెబ్బకు రిషభ్ పంత్ న్ని విమర్శించిన వాళ్లే ఇప్పుడు పొడుతున్నారు. టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ వికెట్ కీపర్లల్లో ఒకడిగా అభివర్ణిస్తున్నారు. ఆడమ్ గిల్‌క్రిస్ట్, మహేంద్ర సింగ్ ధోనీ, జానీ బెయిర్‌స్టో, కుమార సంగక్కరతో పోల్చుతున్నారు. వారి కంటే బెస్ట్ బ్యాటర్‌గా ప్రశంసిస్తోన్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వెంకటేష్ ప్రసాద్, వసీం జాఫర్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి జయ్ షా రిషభ్ పంత్‌ను ఆకాశానికెత్తేస్తోన్నారు.