By: Oneindia Telugu Video Team
Published : June 21, 2017, 03:22

నాన్సెన్స్ ... దేశభక్తి కి క్రికెట్ కి సంబంధం ఏంటి? మనసు దోచిన క్రికెటర్

Subscribe to Oneindia Telugu

బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మొర్తజా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవలేకపోవచ్చు. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానుల మనసులు మాత్రం గెలుచుకున్నాడు. దేశభక్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఓ ఫిలాసఫర్‌గా మారాడు. తన వ్యాఖ్యల ద్వారా టోర్నీలో తమ జట్టు ఓడిందనే బాధ నుంచి అభిమానుల్ని తేరుకునేలా చేశాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మోర్తజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్రికెటర్లుగా తాము దేశానికి చేసేదేమీ లేదని... తమను హీరోలుగా, స్టార్లుగా కీర్తించవద్దని మోర్తజా కోరాడు. డబ్బులు ఇస్తేనే తాము క్రికెట్ ఆడుతామని... ఈ నేపథ్యంలో క్రికెట్ కు, దేశ భక్తికి ముడిపెట్టవద్దని చెప్పాడు. ఏ దేశంలోనైనా నిజమైన హీరోలు రైతులేనని తెలిపాడు. పొలంలో పంటలు పండించే రైతులు, దేశ గోడలను నిర్మించే శ్రామికులు, ప్రాణాలను కాపాడే డాక్టర్లే నిజమైన హీరోలని చెప్పాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా