By : Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

దొంగ నోట్ల ముఠా అరెస్ట్

హైదరాబాద్: దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని అవకాశంగా తీసుకొని మోసానికి పాల్పడిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఫిలింనగర్‌లో నోట్లు మార్పిడి చేస్తామని మోసానికి పాల్పడిన టపాచబుత్ర సీఐ రాజశేఖర్‌తో పాటు పది మందిని డిసెంబర్‌ 1న అరెస్టుచేసిన బంజారాహిల్స్‌ పోలీసులు మంగళవారం మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ‘రూ.80 వేలు కొత్త నోట్లు ఇస్తే రూ.లక్ష పాత నోట్లు ఇస్తామని నిందితులు ప్రచారం చేశారు. ప్రచారం నమ్మిన కొందరు ఈ నెల 1న రూ.1.55 కోట్లు కొత్తనోట్లు తీసుకొని వెళ్లారు. 20శాతం కమీషన్‌ వస్తుందనే ఆశతో కొత్త నోట్లు తీసుకెళ్లారు. అయితే ఆ నలుగురినీ బెదిరించి రూ.52 లక్షలను సీఐ రాజశేఖర్‌, తిరుమలేశ్‌ నాయుడు బృందం తీసుకుంది.’అని వివరించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా