By : Oneindia Telugu Video Team
Published : November 23, 2020, 03:40
Duration : 03:53
03:53
జంట తుఫాన్ల జల పడగ: పొంచివున్న పెను ముప్పు: నివార్, గతి: భారీ వర్షాలతో అల్ల కల్లోలమే
రెండు తెలుగు రాష్ట్రాలకు పెను తుఫాన్ ముప్పు పొంచివుంది. ఇప్పటికే అతి భారీ వర్షాలతో తొణికిసలాడుతోన్న ఏపీ, తెలంగాణలపై జంట తుఫాన్లు జల పడగను విప్పబోతోన్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరుగా ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండంగా మార్పు చెందాయి. ఆ స్థితి నుంచి మరింత ఉగ్ర రూపాన్ని సంతరించుకోబోతోన్నాయి. తుఫాన్‌గా అవతరించనున్నాయి. ఈ రెండు తుఫాన్ల వల్ల ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.