By: Oneindia Telugu Video Team
Published : December 31, 2017, 05:06

దిన ఫలాలు 01-01-2018

Subscribe to Oneindia Telugu

దిన ఫలాలు 01-01-2018

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. జనవరి 1వ తేదీ సోమవారం 2018 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస శుద్ద చతుర్దశి మృగశిర నక్షత్రం మద్యాహ్నం 3 గంటల 14 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి అనుకున్న పనులు ఒత్తిడి తోనైనా పూర్తి చేస్తారు. ఇంటి పనులు శ్రద్దగా పూర్తి చేయవలసి వుంది. ధన సంబంధ ప్రణాళికలు వేస్తారు. భార్య సహకారం వుంటుంది. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలగజేస్తాయి. వృషభ రాశి వారు తలచిన పనులకు ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల వార్తలు వింటారు. మిధున రాశి వారికి ఆర్ధిక ఇబ్బందులున్నాయి. ఆధ్యాత్మిక చింతన వుంటుంది. విహార యాత్రలు చేస్తారు. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు ఆటంకాలతో జరుగుతాయి. ఇంటి సమస్యలు పరిష్కారమవుతాయి..సింహ రాశి వారికి దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సోదరుల సహకారం వుంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. కన్య రాశి వారికి దూర బంధువులు ఇంటికి వస్తారు. ధన ప్రణాళికలు అనుకూల ఫలితాలని ఇస్తాయి.. తుల రాశి వారికి అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. వ్యాపార ప్రణాళికలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వారు దూర బంధు వార్తలు వింటారు. భార్య సహకారం తో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పన్నులు బకాయిలు చెల్లించవలసి వుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ధనూ రాశి వారికి కొన్ని పనులు సులువుగా కొన్ని పనులు కష్టంగా జరుగుతాయి. ధనానికి ఇబ్బందులున్నాయి. మకర రాశి వారికి భార్య సహకారంగా ఉండగలదు. పిల్లలతో ఆనందగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కుంబ రాశి వారికి ధన ప్రణాళికలు అనుకున్న ఫలితన్నిస్తాయి. అధికారులు మెప్పు కుడా పొందుతారు. దూరపు సమాచారం వింటారు. మీన రాశి వారు దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లల యెడల శ్రద్ద వహించాలి. అనుకున్న పనులు యందు ఆటంకాలు ఉన్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా