• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 04, 2018, 10:33
    Duration : 03:10

    దిన ఫలాలు 04-01-2018

    దిన ఫలాలు 04-01-2018
    తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. జనవరి 4 వ తేదీ గురువారం 2018 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస బహుళ తదియ.. రాత్రి 2 గంటల 13 నిమిషముల వరకు వుంది. పుష్యమి నక్షత్రం ఉదయం 10 గంటల 14 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి ఇంటికి సంబంధించిన పనులు శ్రద్ద గా పూర్తి చేస్తారు. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలగజేస్తాయి. వృషభ రాశి వారికి దగ్గరి బంధువుల రాకపోకలుంటాయి. సోదరుల సహచరుల సహకారం వుంటుంది.. దూరపు బంధువుల వార్తలు వింటారు. మిధున రాశి వారికి..ధన ప్రణాళికలు వేస్తారు. అనుకున్న పనులు ఆటన్కలతో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు జరుగుతాయి. భూ సంబంధించిన లావాదేవీలు ఓ కొలిక్కి వస్తాయి. సింహ రాశి వారికి దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సోదరుల సహకారం వుంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. కన్య రాశి వారికి దూర బంధువులు ఇంటికి వస్తారు. ధన ప్రణాళికలు అనుకూల ఫలితాలని ఇస్తాయి.. ప్రయాణాల యందు మెళకువలు అవసరం. తుల రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల యందు మక్కువ చూపుతారు..వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాల యందు లాభాన్ని పొందుతారు. దూర బంధు వార్తలు వింటారు. ప్రయాణాల యందు మక్కువ చూపుతారు.. ధనూ రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలు వున్నాయి. పని వారి సహకారం వుంటుంది. ధన ప్రణాలికలు అనుకూలిస్తాయి..వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా వుంటాయి..మకర రాశి వారికి భార్యతో అనుకూల దాంపత్యం కలదు..కొత్త అవకాశాల విషయం లో జాగ్రత్త అవసరం..వృత్తి వ్యాపారాలు పట్టుదలగా చేయవలసి వుంటుంది. కుంబ రాశి వారికి అనుకున్న పనులు లాభాలతో పూర్తి చేస్తారు. తండ్రి గారి సహకారం పూర్తిగా వుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. మీన రాశి వారు పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. దుర్గా దేవి ఆరాధనతో సమస్యలు పరిష్కారం అవ్వగలవు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా